Top Mutual Funds Course Online

మ్యూచువల్ ఫండ్స్ కోర్స్ - మీ డబ్బు మీ కోసం పని చేసేలా చేయండి!

4.8 రేటింగ్ 85.8k రివ్యూల నుండి
2 hrs 25 mins (8 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹799
₹1,173
32% డిస్కౌంట్
కోర్సు గురించి

మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల సంపదను పెంచుకోవడానికి, మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడానికి అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఓ మార్గం ఏర్పడుతుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్‌ లో మదుపు చేయడం ఎక్కడ నుంచి ప్రారంభించాలన్న విషయంలో కొంత గందరగోళం ఉండటం సహజమే. ఈ గందరగోళాన్ని తొలగించి మీకు ఆర్థిక భద్రతను చేకూర్చడానికి ffrreedom Appలోని  మ్యూచువల్ ఫండ్స్ కోర్సు ఉపయోగపడుతుంది. ఈ కోర్సు మీకు మ్యూచువల్ ఫండ్‌ అంటే ఏమిటి?, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్‌లు, భారతదేశంలోని మ్యూచువల్ ఫండ్‌లు మరియు మ్యూచువల్ ఫండ్‌ల ప్రయోజనాలను తెలియజేస్తుంది. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా పెట్టుబడి ప్రారంభించాలో  ఈ కోర్సు మీకు నేర్పుతుంది. ఈక్విటీ ఫండ్‌లు, డెట్ ఫండ్‌లు మరియు హైబ్రిడ్ ఫండ్‌లతో సహా వివిధ రకాల మ్యూచువల్ ఫండ్‌ల గురించి తెలుసుకుంటారు. మీరు మ్యూచువల్ ఫండ్స్ యొక్క విభిన్న పెట్టుబడి వ్యూహాల గురించి మరియు మీ ఆర్థిక లక్ష్యాల కోసం సరైన ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలో కూడా నేర్చుకుంటారు. మ్యూచువల్ ఫండ్స్ కోర్సు ఈక్విటీ మార్కెట్‌ను ఎలా పరిశోధన చేయాలో తెలియజేస్తుంది. అంతేకాకుండా పెట్టుబడి పెట్టడానికి ఉత్తమమైన మ్యూచువల్ ఫండ్‌లను ఎలా ఎంచుకోవాలో అర్థం చేసుకోవడంలో మీకు సహాయం చేస్తుంది. భారతదేశంలో విస్తృత శ్రేణి మ్యూచువల్ ఫండ్‌లు ఉన్నాయి.  అందువల్ల ఈ కోర్సు మీకు భారతదేశంలోని మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ యొక్క సమగ్ర అవలోకనాన్ని అందిస్తుంది మరియు మీ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే దాని గురించి సమాచారం తెలుసుకోవడంలో మీకు సహాయం చేస్తుంది. CS సుధీర్ దూరదృష్టి గల ఆర్థిక విద్యావేత్త. అతను తన కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి భారతదేశంలోని అత్యంత ప్రముఖ ఆన్‌లైన్ ఆర్థిక విద్యా సంస్థను ప్రారంభించాడు. అతను సంస్థను ఆర్థిక విద్యా వేదిక నుండి జీవనోపాధి విద్యా వేదికగా మార్చాడు. లక్షల మంది జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దాడు. ffreedom App ద్వారా జీవనోపాధి విద్యను ప్రోత్సహించాడు. ఈ కోర్సుకు ఆయనే మెంటార్‌గా వ్యవహరిస్తారు. మరెందుకు ఆలస్యం ఈ రోజు మ్యూచువల్ ఫండ్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ ఉన్నతమైన ఆర్థిక భవిష్యత్తుకు బాటలు ఏర్పాటు చేసుకోండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
8 అధ్యాయాలు | 2 hrs 25 mins
17m 10s
అధ్యాయం 1
మ్యూచువల్ ఫండ్స్ పరిచయం

మ్యూచువల్ ఫండ్ యొక్క ప్రాథమిక అంశాలు, వాటి నిర్మాణం & పెట్టుబడి లక్ష్యాలను తెలుసుకోండి. పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకోండి.

40m 41s
అధ్యాయం 2
మ్యూచువల్ ఫండ్స్ టెర్మినోలాజిస్

మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టడానికి ఉన్న నియమ నిబంధనలు తెలుసుకోండి మరియు మ్యూచువల్ ఫండ్స్ టెర్మినాలజీస్ లను అర్థం చేసుకోండి.

10m 28s
అధ్యాయం 3
మ్యూచువల్ ఫండ్స్ ‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి?

ఏకమొత్తం మరియు క్రమబద్ధమైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను అర్థం చేసుకోండి. మ్యూచువల్ ఫండ్ ఖాతాను సృష్టించే విధానాలు మరియు పెట్టుబడికి అవసరమైన పత్రాలను తెలుసుకోండి.

11m 12s
అధ్యాయం 4
స్టాక్స్ మరియు మ్యూచువల్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం

స్టాక్స్ మరియు మ్యూచువల్ ఫండ్స్ గురించి అర్థం చేసుకోండి. పెట్టుబడి పెట్టడం వలన కలిగే లాభ-నష్టాలు మరియు రిస్క్ టాలరెన్స్ గురించి తెలుసుకోండి.

21m 20s
అధ్యాయం 5
వివిధ రకాలైన మ్యూచువల్ ఫండ్స్

వివిధ రకాలు అయిన మ్యూచువల్ ఫండ్స్ రకాలను తెలుసుకోండి. ఎలాంటి ప్లాన్ ఎంచుకుంటే అధిక ప్రయోజనం పొందవచ్చో అర్థం చేసుకోండి.

7m 27s
అధ్యాయం 6
ఉత్తమ మ్యూచువల్ ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి – థియరీ

మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకునేటప్పుడు పరిగణించవలసిన ముఖ్య అంశాలను తెలుసుకోండి. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ & పెట్టుబడి లక్ష్యం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి.

28m 9s
అధ్యాయం 7
ఉత్తమ మ్యూచువల్ ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి – ప్రాక్టికల్

వెబ్‌సైట్‌లు మరియు రేటింగ్ ఏజెన్సీలతో సహా మ్యూచువల్ ఫండ్‌లను పరిశోధించడానికి ఉత్తమమైన మ్యూచువల్ ఫండ్ మరియు వనరులను ఎంచుకోవడానికి అవసరమైన వ్యూహాలను తెలుసుకోండి

8m 44s
అధ్యాయం 8
పేటీయమ్ మనీ యాప్ డెమో

Paytm మనీ యాప్ యొక్క ప్రయోగాత్మక ప్రదర్శనను తెలుసుకోండి. Paytm మనీ యాప్‌ని ఉపయోగించి ఎలా పెట్టుబడి పెట్టాలనే దానిపై అవగాహన పొందండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలని చూస్తున్న నూతన పెట్టుబడిదారులు
  • తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచాలనుకునే వారు
  • మ్యూచువల్ ఫండ్స్ పై తమ పరిజ్ఞానాన్ని విస్తరించుకోవాలని చూస్తున్న ఫైనాన్షియల్ ప్లానర్లు మరియు సలహాదారులు
  • తమ సంపదను అంచెలంచెలుగా పెంచుకోవాలని చూస్తున్న ఆర్థిక నిపుణులు
  • మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలో మరియు వాటిని ఎలా పెంచుకోవాలో తెలుసుకోవాలనుకునే వారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ మరియు వాటి పెట్టుబడి వ్యూహాలను అర్థం చేసుకుంటారు 
  • పెట్టుబడి పెట్టడానికి ఉత్తమమైన మ్యూచువల్ ఫండ్‌లను అన్వేషించడం మరియు ఎంచుకోవడంలో నైపుణ్యం కలిగి ఉంటారు
  • భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటారు 
  • మ్యూచువల్ ఫండ్స్ మరియు ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు అర్థం చేసుకుంటారు
  • సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి మరియు మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను పొందుతారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom App online course on the topic of

Mutual Funds Course - Make your money work for you!

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

కోర్స్ రివ్యూ మరియు నిపుణుల సలహాలు
Testmonial Thumbnail image
Testmonial Thumbnail image
Testmonial Thumbnail image
సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

పెట్టుబడులు , రిటైర్మెంట్ ప్రణాళిక
ఫైనాన్సియల్ ఫ్రీడం కోర్సు - ఇది ధనవంతులు కావడానికి రహదారి!
₹999
₹1,406
29% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
పెట్టుబడులు , ప్రభుత్వ పథకాలు
PMVVY ప్రధాన్ మంత్రి వయా వందన యోజన కోర్సు - ప్రతీ నెలా 9250 రూపాయల పెన్షన్ పొందండి!
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
రుణాలు & కార్డ్స్
పర్సనల్ లోన్ కోసం అప్లై చేస్తున్నారా? మీరు దరఖాస్తు చేసే ముందు ఇది చూడండి!
₹799
₹1,173
32% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు
స్టాక్ మార్కెట్ కోర్సు - ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్‌గా ఉండండి
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు , రియల్ ఎస్టేట్ బిజినెస్
విజయవంతమైన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారడం ఎలా?
₹799
₹1,526
48% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ప్రభుత్వ పథకాలు , రిటైర్మెంట్ ప్రణాళిక
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం కోర్స్- ప్రతి నెలా 5000 రూపాయల వడ్డీని పొందండి!
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యక్తిగత ఫైనాన్స్ - బేసిక్స్
ఫ్యూచర్-రెడీ ఫైనాన్స్ - పోస్ట్-క్రైసిస్ కోర్సు
₹799
₹1,173
32% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Download ffreedom app to view this course
Download