ffreedom appలో ఉన్న బంగారంపై పెట్టుబడి పెట్టడం ఎలా? : కంప్లీట్ గైడ్ కోర్సుకు మీకు స్వాగతం. మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి బంగారం ఎల్లప్పుడూ ఒక నమ్మదగిన పెట్టుబడి ఎంపిక అని అందరూ అంటూ ఉంటారు. అస్సలు బంగారం పై పెట్టుబడి పెట్టడం మంచిదా? కదా?, బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఉన్న మార్గాలు ఏంటి? ఇలా అనేక సందేహాలకు ఈ కోర్సులో సమాధానం దొరుకుతుంది.
ఈ కోర్సులో ప్రముఖ జర్నలిస్ట్ మరియు ffreedom appలో క్రియేటివ్ డైరెక్టర్ గా సేవలందిస్తున్న అభిషేక్ రామప్ప గారు మీకు మార్గదర్శకులుగా ఉంటూ, బంగారంపై పెట్టుబడి పెట్టె అన్ని ఆప్షన్స్ గురించి మీకు తెలియజేస్తారు.
ఈ పూర్తి కోర్సులో మీరు ఫిజికల్ గోల్డ్ ను కొనుగోలు చేయడం, నిల్వ చేయడం మరియు విక్రయించడంలో ఉన్న తప్పు, ఒప్పుల గురించి తెలుసుకుంటారు. అలాగే డిజిటల్ గోల్డ్ యొక్క అభివృద్ధి చెందుతున్న ప్రపంచాన్ని మరియు ప్రభుత్వ బంగారు పథకాల ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషిస్తారు. అంతేకాకుండా, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ మరియు గోల్డ్ ఇటిఎఫ్‌ల గురించి అవగాహన పొందుతారు.
ఇలా మీరు అనేక అంశాల గురించి ఈ కోర్సులో తెలుసుకోవడం వలన సమాచారంతో కూడిన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో అందరికన్నా ముందు వరుసలో ఉంటారు. మీరు ఈ పూర్తి కోర్సును చూడటం ద్వారా, మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మీ స్వంత బంగారు పెట్టుబడి ప్రణాళికను తయారు చేసుకోవడానికి పూర్తిగా సన్నద్ధమవుతారు.
అందువల్ల బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి ఉన్న ఎవరికైనా, మీరు అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులైనా లేదా ఏమాత్రం అనుభవం లేని వారికైనా ఈ కోర్సు ఉత్తమ ఎంపిక.
మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచాలనుకుంటే మరియు ద్రవ్యోల్బణం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే, ఈ కోర్సు మీకు విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం! ఇప్పుడే ఈ పూర్తి కోర్సును చూడండి. బంగారంపై పెట్టుబడి పెట్టడం గురించి తెలుసుకొని, మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోండి.
బంగారంలో పెట్టుబడి పెట్టడానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను అర్థం చేసుకుంటారు.
బంగారం వ్యక్తిగత అవసరాలు, ఆభరణాల తయారీ, మరియు పెట్టుబడి లక్ష్యాలకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి.
బంగారం ధరను ఏ కారకాలు నియంత్రిస్తాయి మరియు పెట్టుబడిదారులకు ఇది ఎందుకు మంచి ఎంపిక అని అర్థం చేసుకుంటారు.
గోల్డ్ బార్, గోల్డ్ కాయిన్స్ , ఆభరణాలు వంటి భౌతిక బంగారంపై పెట్టుబడి పెట్టడం గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ పెట్టుబడి యొక్క లాభాలు మరియు నష్టాలపై అవగాహన పొందుతారు.
డిజిటల్ గోల్డ్ పై పెట్టుబడి పెట్టడానికి ఉన్న వివిధ మార్గాలను అన్వేషిస్తారు.
సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) మరియు వాటి ప్రయోజనాలతో సహా ప్రభుత్వం అందించే వివిధ బంగారు పెట్టుబడి పథకాలు గురించి తెలుసుకుంటారు.
గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌ల రకాలు మరియు వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే లాభనష్టాలు గురించి అవగాహన పొందండి.
ఈ మాడ్యూల్ గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) మరియు వాటి పనితీరు గురించి తెలుసుకోండి.
బంగారంపై పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే లాభనష్టాలు గురించి తెలుసుకోండి.
పెట్టుబడులలో భాగంగా బంగారం ఎంత రాబడిని ఇస్తుంది, ఇతర ఆస్తి తరగతులతో పోల్చితే మంచిదా? కదా? అనే విషయాలను తెలుసుకోండి.
బంగారంపై పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే మూలధన లాభాలపై పన్నులను ఎలా విధిస్తారో అవగాహన పొందండి.
మీ వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ని రూపొందించడానికి దశల వారీ మార్గదర్శకత్వం పొందండి.
- బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి ఉన్నవారు
- తమ పెట్టుబడులను వైవిధ్యపరచాలనుకునే వారు
- ద్రవ్యోల్బణం నుండి తమను తాము రక్షించుకోవాలనుకునే వారు
- రిటైర్‌మెంట్ కోసం బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వారు
- బంగారం మార్కెట్‌ను అర్థం చేసుకోవాలనుకునే వారు
- బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఉన్న వివిధ మార్గాలను అన్వేషిస్తారు.
- బంగారం ధరను ప్రభావితం చేసే అంశాలను తెలుసుకుంటారు
- బంగారంలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే లాభనష్టాలుపై అవగాహన పొందుతారు.
- బంగారం పెట్టుబడిపై పన్నుల ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటారు.
- బంగారంపై పెట్టుబడి పెట్టె వ్యూహాలను రూపొందించుకుంటారు..
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.