నమస్కారం! ఎడ్యుకేషన్ లోన్ కోర్సుకు మీకు స్వాగతం! చదువుకోవాలన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది, కానీ ఆర్థిక పరిస్థితులు అడ్డు వస్తుంటాయి. మంచి కళాశాలలో చదవాలి, గొప్ప విద్యను పొందాలంటే, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ లోన్ మీకు అవసరం అవ్వొచ్చు.
అందుకే ఈ కోర్సులో, ఎడ్యుకేషన్ లోన్ అంటే ఏమిటి? దాన్ని ఎలా పొందాలి? ఏ బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు అందిస్తాయి? ఏవిధంగా తిరిగి చెల్లించాలి? అనే విషయం గురించి అన్ని వివరంగా తెలియజేశాము. విద్య కోసం తీసుకునే లోన్‌ను సరైన రీతిలో ప్లాన్ చేసుకోవడం ఎంత ముఖ్యమో కూడా మీరు ఈ కోర్సులో నేర్చుకుంటారు.
కొందరికి లోన్ తీసుకోవాలంటే భయంగా ఉంటుంది. తిరిగి చెల్లించలేకపోతే? వడ్డీ ఎక్కువ అవుతుందా? ఇది నా భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? – ఈ ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి. కానీ సరైన అవగాహన ఉంటే, ఎడ్యుకేషన్ లోన్ మీపై ఆర్థిక భారం లేకుండా మీ కెరీర్‌ను మలిచే శక్తివంతమైన సాధనంగా మారుతుంది.
ఈ కోర్సులో ఎడ్యుకేషన్ లోన్ ఎలా పొందాలి, ఏమేం డాక్యుమెంట్లు అవసరం, తక్కువ వడ్డీ రేట్లు ఎలా పొందాలి, రీపేమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే అంశాలను సులభంగా అర్థమయ్యేలా మీకు వివరించబడుతుంది. అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, ప్రత్యేక ప్రయోజనాల గురించి కూడా మీరు ఇందులో తెలుసుకుంటారు.
ఉన్నత చదువులో వచ్చే అర్థిక సమస్యల వలన ఆగిపోవద్దు. సరైన అవగాహనతో ముందుకు వెళితే, మీ భవిష్యత్తును మరింత వెలుగులోకి తీసుకురాగలుగుతారు. ఈ కోర్సును పూర్తి చేసి, మీ విద్యకు, మీ కెరీర్‌కు బలమైన పునాదిని ఏర్పరచుకోండి!
విద్యా రుణాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి మరియు మీ ఉన్నత విద్యకు నిధులు సమకూర్చడంలో అవి మీకు ఎలా సహాయపడతాయో అర్థం చేసుకోండి.
భారతదేశంలో అందుబాటులో ఉన్న వివిధ రకాల విద్యా రుణాలు మరియు వాటి అర్హత ప్రమాణాల గురించి తెలుసుకోండి.
ఎడ్యుకేషన్ లోన్‌ల యొక్క లక్షణాలను తెలుసుకోండి మరియు మీ కలలను సాకారం చేసుకోవడంలో అవి మీకు ఎలా ఉపయోగపడతాయో అర్థం చేసుకోండి.
ఎడ్యుకేషన్ లోన్‌కు ఎవరు అర్హులు మరియు అవసరమైన అర్హత ప్రమాణాలను గురించి తెలుసుకోండి.
విద్యా రుణాల ద్వారా కవర్ అయ్యే ఖర్చుల గురించి మరియు మీ ఆర్థిక అవసరాలను తీర్చడంలో అవి మీకు ఎలా సహాయపడతాయో తెలుసుకోండి.
ఎడ్యుకేషన్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి మరియు ఆకట్టుకునే లోన్ అప్లికేషన్‌ను ఎలా రూపొందించాలి అనేదాని పై దశల వారీ మార్గదర్శకాలను పొందండి.
వడ్డీ రేట్లు మరియు EMI కాలిక్యులేటర్‌లు ఎలా పని చేస్తాయి మరియు మీ ఫైనాన్స్‌లను ఎలా సమర్థవంతంగా నిర్వహించాలో అర్థం చేసుకోండి.
విద్యా రుణాల ప్రయోజనాలను మరియు అవి మీ భవిష్యత్తును ఎలా సానుకూలంగా ప్రభావితం చేస్తాయో కనుగొనండి.
విద్యా రుణాల గురించి సాధారణంగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు పొందండి మరియు మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.
- ఉన్నత విద్య కోసం నిధులను ఎలా పొందాలో తెలుసుకోవాలనుకుంటున్న విద్యార్థులు
- తమ పిల్లల చదవుల కోసం రుణాలు పొందటం గురించి తెలుసుకోవాలనుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు
- విద్య లోన్ పొందడానికి అవసరమైన అర్హత ప్రమాణాలు మరియు దరఖాస్తు ప్రక్రియ ను అర్థం చేసుకోవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు
- విద్యార్ధి రుణాలపై తమ పరిజ్ఞానాన్ని విస్తరించాలనుకునే విద్య లేదా ఆర్థిక రంగాలలో పనిచేస్తున్న నిపుణులు
- విద్య రుణం తీసుకోని ఏవిధంగా ఒత్తిడి లేకుండా రుణాన్ని చెల్లించాలి అని ఆలోచిస్తున్నవారు


- విద్య రుణాలు అంటే ఏమిటి మరియు ఉన్నత విద్యకు నిధులు సమకూర్చడంలో వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు
- భారతదేశంలో అందుబాటులో ఉన్న వివిధ రకాల విద్య రుణాలు మరియు లోన్ పొందే అర్హత ప్రమాణాల గురించి తెలుసుకుంటారు
- విద్యా రుణం కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు గురించి అవగాహన పొందుతారు
- ఎడ్యుకేషన్ లోన్ పొందే దశల వారు ప్రక్రియ గురించి అలాగే ఇతరులు కంటే సమర్ధవంతంగా దరఖాస్తును ఎలా రూపొందించాలో తెలుసుకుంటారు
- పొందిన లోన్ ను నిర్ణీత కాలంలోపు తిరిగి చెల్లించేలా మీ ఫైనాన్స్‌ను ఎలా సమర్థవంతంగా నిర్వహించాలో తెలుసుకుంటారు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.