బాతుల పెంపకం, వాటి ఉత్పత్తుల మార్కెటింగ్ సంబంధిత బిజినెస్ అంటే మీకు ఆసక్తి ఉందా? అయితే బాతుల పెంపకం పై రూపొందించిన ఈ కోర్సు మీకు చాలా ఉపయోగపడుతుంది. బాతుల పెంపకానికి మీరు కొత్త అయినా లేదా ఇప్పటికే బాతుల పెంపకం చేపడుతున్నా కూడా ఈ కోర్సు వల్ల ప్రయోజనం ఉంటుంది.
కోళ్ళ మాదిరిగా బాతులను కూడా మాంసం లేదా గుడ్ల కోసం పెంచవచ్చు. సరైన ప్రణాళిక, కృషితో బాతులను పెంచితే మంచి లాభదాయకంగా ఉంటుంది. కోళ్లతో పోలిస్తే బాతుల నిర్వహణ అంటే ఆరోగ్య సంరక్షణ, పోషణ చాలా చౌక మరియు సులభం. ఏ వాతావరణ పరిస్థుల్లోనైనా బాతులు చాలా బాగా పెరుగుతాయి. దీని వల్ల వీటి పెంపకం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.
కర్ణాటకకు చెందిన విజయ్ కుమార్‌కు బాతుల పెంపకంలో అనేక ఏళ్ల అనుభవం ఉంది. ఈ కోర్సులో భాగంగా అతను మీకు మెంటార్‌గా వ్యవహరిస్తారు. బాతుల పెంపకం, మార్కెటింగ్ విషయంలో మీకు వచ్చే సందేహాలకు సమాధానాలు కూడా ఇస్తారు.
ffreedom App లోని బాతుల పెంపకానికి సంబంధించిన కోర్సు మీకు మంచి, ఆర్థికంగా లాభాన్ని చేకూర్చే బాతుల జాతులను ఎన్నుకోవడం, వాటిని పెంచడం, మార్కెటింగ్ చేయడం వరకూ ఉన్న ప్రతి దశనూ వివరిస్తుంది. ఉత్పాదకత, లాభదాయకత పెరగడానికి బాతుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిట్కాలు కూడా ఈ కోర్సు తెలియజేస్తుంది. మొత్తంగా 1000 బాతులను పెంచుతూ 6 నెలల్లో రూ.4 లక్షలను సంపాదించడం ఎలాగో ఈ కోర్సు మీకు తెలియజేస్తుంది. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి విజయవంతంగా బాతుల పెంపకాన్ని చేపట్టండి.
బాతుల పెంపకానికి సంబంధించి ప్రాథమిక అవగాహనకు వస్తాం. మార్కెట్లో వీటి మాంసానికి ఉన్న డిమాండ్, ధర తదితరాలు
బాతుల పెంపకంలో విశేష అనుభవం ఉన్న వ్యక్తి అనుభవాలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. తద్వారా రాబోయే సవాళ్లకు పరిష్కారాలను వూహించవచ్చు
బాతుల పెంపకం అంటే ఏమిటన్న విషయం పై అవగాహన కలుగుతుంది. వీటిని ఎవరు? ఏ వాతావరణ పరిస్థితుల్లో పెంచవచ్చో స్పష్టత వస్తుంది
వివిధ జాతులకు చెందిన బాతులు వాటి ప్రత్యేకతలు ఈ మాడ్యూల్ ద్వారా తెలుస్తాయి. అంటే గుడ్ల కోసం వేటిని పెంచాలి? మాంసం కోసం ఏ జాతి మేలు వంటివి
బాతు పిల్లల పెంపకానికి కావాల్సిన స్థల విస్తీర్ణం పై అవగాహన కలుగుతుంది. అదేవిధంగా మొదట్లో పెట్టుబడి కోసం ఎంత సొమ్ము సమకూర్చుకోవాలో తెలుస్తుంది
బాతు పిల్లల పెంపకం, షెడ్ నిర్మాణానికి అవసరమైన అనుమతుల పై స్పష్టత వస్తుంది. వాటిని ఏ ప్రభుత్వ శాఖల నుంచి తీసుకోవాలో స్పష్టత వస్తుంది
బాతు పిల్లలు పెరిగి పెద్దవయ్యే వరకూ ఉన్న దశలను గూర్చి తెలుసుకుంటాం. ఏ ఏ దశలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టత వస్తుంది.
బాతు పిల్లల పెంపకానికి అవసరమైన మానవ వనరుల పై అవగాహన కలుగుతుంది. వారికి ఎటువంటి శిక్షణ ఇవ్వాలో స్పష్టత వస్తుంది
బాతులకు అవసరమైన ఆహారం, నీటి సరఫరాకు సంబంధించిన విషయాల పై అవగాహన కలుగుతుంది. ఉత్పదకత పై నాణ్యమైన పోషకాహారం ప్రభావాన్ని అర్థం చేసుకుంటాం
బాతులకు వచ్చే వ్యాధులు, వాటి నివారణకు సంబంధించిన విషయాల పై స్పష్టత వస్తుంది. టీకాలు ఏ దశలో వేయాలో కూడా తెలుస్తుంది
బాతుల ఉత్పత్తులను, ఉప ఉత్పత్తులను సేకరించడం, నిల్వచేయడం, రవాణా చేయడం ఎలాగో తెలుస్తుంది. అదేవిధంగా బాతుల పెంపకానికి అవసరమైన వాతావరణం పై అవగాహన పెరుగుతుంది
బాతుల నుంచి వచ్చే ముఖ్యమైన ఉత్పత్తులు ముఖ్యంగా మాంసం, గుడ్లు ఎప్పుడు సేకరించాలి? మార్కెటింగ్ ఎలా వంటి విషయాల గురించి ఈ మాడ్యూల్ స్పష్టతను ఇస్తుంది
బాతు పిల్లల పెంపకానికి సంబంధించిన జమా ఖర్చుల పై స్పష్టత వస్తుంది. ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయాల్సిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన పెరుగుతుంది
బాతు పిల్లల పెంపకం, విక్రయం వల్ల వచ్చే ఆదాయం పై ఈ మాడ్యూల్ స్పష్టతను ఇస్తుంది. అంతేకాకుండా నిఖర లాభాలను ఎలా గణించాలో తెలుసుకోవచ్చు.
బాతు మాంసానికి ఉన్న మార్కెట్ పై స్పష్టత వస్తుంది. అంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని డిమాండ్ అందుకు అనుగుణంగా చేయాల్సిన సరఫరా పై అవగాహన పెరుగుతుంది
బాతు మాంసానికి సంబంధించిన క్రయ, విక్రయాలకు ఏ ఫ్లాట్‌ఫాం అనువుగా ఉంటుందో తెలుస్తుంది. ఆన్ / ఆఫ్‌లైన్ అమ్మకాల వ్యూహాల గురించి అవగాహన పెరుగుతుంది
బాతుల పెంపకానికి సంబంధించిన సలహాలు సూచనలు అందుతాయి. లాభాలను పెంచుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు కూడా వీరు తెలుపుతారు
- పౌల్ట్రీ రంగంలో రాణించాలని భావిస్తున్న వారికి ఈ కోర్సు చాలా ఉపయోగకరం
- ఇప్పటికే పౌల్ట్రీ రంగంలో ఉన్న వారు కూడా అదనపు ఆదాయం కోసం బాతుల పెంపకాన్ని గురించి ఆలోచించవచ్చు
- వ్యాపారంలో విభిన్నంగా ముందుకు వెళ్లి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించాలని భావించేవారికి ఈ బాతుల పెంపకం ఉపయుక్తకరం
- సమగ్ర వ్యవసాయ విధానాలు అవలంభిచాలని భావిస్తున్న వారికి ఈ కోర్సు వల్ల ఉపయోగం ఉంటుంది
- అగ్రికల్చరల్, పౌల్ట్రీ వంటి కోర్సులు చేస్తున్న విద్యార్థలు
- బాతుల యొక్క వివిధ జాతులు వాటి లక్షణాల గురించి తెలుసుకుంటారు
- గుడ్లు పొదిగే సమయంలో ఉష్ణోగ్రత మరియు తేమ నియంత్రణ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు
- వివిధ పెరుగుదల దశలలో ఉన్న బాతు పిల్లలకు అందించాల్సిన ఆహారం గురించి తెలుసుకుంటారు
- ఆరోగ్య సంరక్షణ చర్యల పై అవగాహన పెరుగుతుంది
- బ్రాండ్‌ను నిర్మించడం, ధరలను నిర్ణయించడం మరియు లాభాలను పెంచుకోవడానికి ఉపయోగపడే వ్యూహాల పై అవగాహన పెరుగుతుంది
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.