ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
కార్ అన్నది ఒకప్పుడు “లగ్జరీ” వస్తువుల జాబితాలో ఉండేది. అయితే వేగంగా మారుతున్న ఈ పోటీ ప్రపంచంలో ఈ కార్ “నీడీ” వస్తువుగా మారిపోతోంది. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో వృత్తి, వ్యాపారం చేసేవారు తమ రోజువారి కార్యకలాపాల కోసం ఒక్కొక్క సారి 50 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి కార్ ఉండటం చాలా అవసరం. మరోవైపు చాలామంది కార్‌ను తమ స్టేటస్ సింబల్‌గా భావిస్తుంటారు. ఇలా కారణం ఏదైనా సొంతంగా కార్‌ను కలిగి ఉండాలనే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. అయితే కార్‌ను ఒక్కసారిగా డబ్బు పెట్టి కొనే స్థోమత అందిరికీ ఉండటం లేదు. దీంతో లోన్ తీసుకుని కార్‌ను కొంటున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తక్కువ వడ్డీకే కార్ లోన్‌ను పొందవచ్చు.