ffreedom appలో ఉన్న “అడోబ్ ప్రీమియర్ ప్రో వీడియో ఎడిటింగ్: బిగినర్స్ గైడ్” కోర్సుకు మీకు స్వాగతం. ఈ కోర్సు ద్వారా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకునేవారు, ఉత్తమ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లలో ఒకటైన అడోబ్ ప్రీమియర్ ప్రో ఫ్లాట్ ఫార్మ్ లో ఏవిధంగా వీడియోలను ఎడిటింగ్ చేయాలో నేర్చుకుంటారు.
ఈ పూర్తి కోర్సులో, మొదటగా అడోబ్ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్ ను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో, ఏవిధమైన ఆప్షన్స్ ఉంటాయో తెలుసుకుంటారు. అలాగే సోర్స్, రెఫెరెన్సు, టైమ్ లైన్ మానిటర్లు ఎక్కడ ఉంటాయో అవగాహన పొందుతారు. అలాగే వీడియో ఫైల్స్ ను ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, రఫ్ కట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుంటారు. అంతే కాకుండా, వీడియోకి స్టైల్స్, ఎఫెక్ట్స్, మ్యూజిక్, గ్రాఫిక్స్, కలర్స్ మరియు టెక్స్ట్ ను ఎలా యాడ్ చేసుకోవాలో నేర్చుకుంటారు.
ఈ కోర్సును చూడటం ద్వారా మీరు, యూట్యూబ్ లాంగ్ ఫార్మ్ - షార్ట్ ఫార్మ్, ఇంస్టాగ్రామ్ రీల్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలో నేర్చుకుంటారు. అలాగే వీడియో ఎడిట్ చేయడం పూర్తి అయ్యిన తర్వాత ఎలా ఎక్సపోర్ట్ చేయాలో కూడా అవగాహన పొందుతారు. అంతే కాకుండా వెడ్డింగ్ వీడియోస్ ను క్రియేట్ చేసేటప్పుడు ఎలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలో తెలుసుకుంటారు.
ఈ కోర్సులో వీడియో ఎడిటింగ్ చేయడంలో గత 16 సంవత్సరాల అనుభవం ఉన్న 35MM Arts వ్యవస్థాపకుడు శ్రీ నారి నరేంద్ర గారు మెంటార్ గా ఉంటూ, అడోబ్ ప్రీమియర్ ప్రో ఇన్స్టాలేషన్ నుండి వీడియోను క్రియేట్ చేసి, ఎక్సపోర్ట్ చేయడం వరకు ప్రతి ఒక అంశాన్ని మీరు నేర్పిస్తారు.
కాబ్బటి, అడోబ్ ప్రీమియర్ ప్రో లో వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని ఏమాత్రం మిస్ చేసుకోకండి. ఇప్పుడే ffreedom appలో, ఈ కోర్సును చూడండి. మీ విజయంతమైన వీడియో ఎడిటింగ్ ప్రయాణాన్ని ప్రారంభించండి.
అడోబ్ ప్రీమియర్ ప్రో ఏవిధంగా ఇంస్టాల్ చేసుకోవాలో అవగాహన పొందండి. అలాగే అడోబ్ ప్రీమియర్ ప్రో లో ఉన్న ఆప్షన్స్ మరియు సెట్టింగ్స్ గురించి తెలుసుకోండి.
మీ వర్క్‌స్పేస్‌ని ఎలా సెటప్ చేసుకోవాలి, క్లిప్‌లను ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి మరియు వర్క్‌ఫ్లోను క్రియేట్ చేయడానికి మీ ఫస్ట్ రఫ్ కట్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.
ప్రేక్షకులను ఆకట్టుకునేలా ట్రాన్సిషన్స్ నుండి క్రియేటివ్ ఎఫెక్ట్స్ వరకు అన్ని ఆప్షన్ల ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
వీడియో అందంగా ఎఫెక్టివ్ గా రావడానికి ఎలాంటి ఆడియోలను ఎంచుకోవాలి. అలాగే సిన్ టూ సిన్ బాగా రావడానికి ఓవర్ లాప్ ఎలా చేసుకోవాలో నేర్చుకోండి.
మీ వీడియోలకు ఎమోషన్స్ పండేలా ఎలాంటి మ్యూజిక్ మరియు సౌండ్ ఎఫెక్ట్‌లను ఉపయోగించాలో తెలుసుకోండి.
మీ వీడియో కనుల విందు చేయడానికి ఎలాంటి కలర్స్ ను ఎంచుకోవాలో మరియు వాటిని ఎలా వీడియోలో ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
టెక్స్ట్ మరియు ఇన్ఫోగ్రాఫిక్‌లను మీ వీడియోస్ లో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
మీరు చేసిన వీడియోను ఎక్సపోర్ట్ చేయడానికి ముందు ఎలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవలసిన ఉంటుందో తెలుసుకోండి.
మీరు చేసిన ప్రాజెక్ట్ ను ఏవిధంగా ఎక్సపోర్ట్ చేసుకోవాలో నేర్చుకోండి.
యూట్యూబ్ లాంగ్-ఫార్మ్ కంటెంట్ వీడియోను ఏవిధంగా ఎడిట్ చేసుకోవాలో నేర్చుకోండి.
యూట్యూబ్ షార్ట్ -ఫార్మ్ కంటెంట్ వీడియోను ఏవిధంగా ఎడిట్ చేసుకోవాలో నేర్చుకోండి.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ను ఏవిధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకోండి. అలాగే అడోబ్ ప్రీమియర్ ప్రో లో వచ్చిన నూతన ఆప్షన్ గురించి తెలుసుకోండి.
ఒక వెడ్డింగ్ వీడియో చేసేటప్పుడు ఎలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలో తెలుసుకోండి.
ప్రస్తుతం వీడియో ఎడిటింగ్‌లో ఉన్న కెరీర్ ఆప్షన్స్ గురించి తెలుసుకోండి. ఈ పరిశ్రమలో ఎలా నిలదొక్కుకోవాలో మా మెంటార్ నుండి తెలుసుకోండి.
- వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకునే ప్రారంభికులు
- కంటెంట్ క్రియేటర్లు అవ్వాలనే ఆసక్తి ఉన్నవారు
- మీడియాలో తమ కెరీర్ ను ప్రారంభించాలనుకునేవారు
- వీడియో కంటెంట్ ద్వారా వారి మార్కెటింగ్‌ను మెరుగుపర్చుకోవాలనుకునే చిన్న వ్యాపార యజమానులు మరియు ఫ్రీలాన్స్
- వీడియో ఎడిటింగ్‌లో తమ కెరీర్ ను ప్రారంభించాలనుకునేవారు
- వీడియో ఎడిటింగ్ బేసిక్ అంశాలను తెలుసుకుంటారు
- క్రియేటివ్ స్టైల్స్ మరియు ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో నేర్చుకుంటారు
- బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ మరియు వాయిస్‌ఓవర్స్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసుకుంటారు
- యూట్యూబ్ వీడియోస్, షాట్స్ మరియు ఇంస్టాగ్రామ్ రీల్స్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో నేర్చుకుంటారు
- ఎడిటింగ్ పరిశ్రమ సూచనలు మరియు కెరీర్ మార్గదర్శకాలను పొందుతారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.