ffreedom appలోని "PM సూర్యఘర్ పథకం: మీ ఇంటికి ఉచిత విద్యుత్‌ని పొందండి" కోర్సుకు స్వాగతం. ఈ కోర్సు ద్వారా మీరు మీ ఇంటికి ఉచిత విద్యుత్‌ని ఎలా పొందాలి మరియు PM సూర్యఘర్ పథకం నుండి ఎలా డబ్బు సంపాదించవచ్చు అనే విషయాలను మీరు ఇక్కడ వివరంగా నేర్చుకుంటారు.
ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన పథకం. ఇంటి పైకప్పుమీద సోలార్ ప్యానల్ అమర్చడం ద్వారా ఇంటికి కావలసిన విద్యుత్‌ను ఈ పథకం ద్వారా ఉచితంగా పొందవచ్చు. పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడం, విద్యుత్ బిల్లులను తగ్గించడం ద్వారా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు సహాయం చేయడం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో విద్యుద్దీకరణను పెంచడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు.
ఈ పథకం కింద, అర్హులైన లబ్ధిదారులు తమ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్‌ను అమర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుండి సబ్సిడీ పొందవచ్చు అలాగే, తక్కువ వడ్డీ రేటుకే రుణ సహాయం కూడా లభిస్తుంది. ఈ పథకం కింద ఒక్కసారి సోలార్ యూనిట్ పెట్టుకుంటే 25 ఏళ్ల పాటు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఒక్కో ఇంటికి ఏడాదికి ₹15,000 నుండి ₹18,000 వరకు విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని అంచనా. అలాగే మీరు ఉపయోగించిన తరువాత మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కి అమ్మడం ద్వారా డబ్బు కూడా సంపాదించవచ్చు.
ఈ కోర్సులో మీరు, సోలార్ ఎనర్జీ అంటే ఏమిటి? మీరు PM సూర్యఘర్ పథకం ఎలా పనిచేస్తుంది, ఈ ప్రభుత్వ పథకాన్ని పొందేందుకు ఎవరు అర్హులు, ఎంత పెట్టుబడి కావాలి మరియు సబ్సిడీ ఎంత లభిస్తుంది, ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి, సోలార్ ప్యానెల్‌ల ఇన్‌స్టాలేషన్ మరియు నిర్వహణ, సోలార్ ప్యానెల్‌లను ఇన్‌స్టాల్ చేయడం వల్ల వచ్చే ఆదాయం మరియు ప్రయోజనాల గురించి పూర్తిగా నేర్చుకుంటారు. కాబట్టి ఇప్పుడే ఈ పూర్తి కోర్సును చూడండి, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి.
సూర్యఘర్ పథకం యొక్క ప్రాథమిక విషయాలను మరియు మీ ఇంటికి ఉచిత విద్యుత్ ను అందించడంలో దాని పాత్ర గురించి తెలుసుకోండి.
సూర్యఘర్ పథకం నుండి మీరు పొందగలిగే వివిధ ప్రయోజనాల గురించి తెలుసుకోండి.
రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఇంస్టాల్ చేసుకోవడం ద్వారా మీరు డబ్బును ఎలా ఆదా చేయవచ్చు మరియు డబ్బు ఎలా సంపాదించవచ్చో తెలుసుకోండి.
రూఫ్ టాప్ సోలారును ఏర్పాటు చేయడంలో అయ్యే ఖర్చు మరియు ఎంత డబ్బును సేవ్ చేయగలరు అనే లెక్కలను అర్థం చేసుకోండి.
సూర్యఘర్ పథకానికి ఎవరు అర్హులు మరియు దరఖాస్తు చేయడానికి ఎలాంటి డాక్కుమెంట్స్ అవసరమో తెలుసుకోండి.
సూర్యఘర్ పథకం కోసం ఎలా ధరఖాస్తు చేసుకోవాలో దశల వారీ వివరణ పొందండి.
సూర్యఘర్ పథకానికి మద్దతు ఇచ్చే బ్యాంకులు మరియు వెండర్స్ గురించి తెలుసుకోండి.
సరైన పనితీరును నిర్ధారించడానికి మీ సోలార్ పానెల్స్ ఎలా నిర్వహించాలో తెలుసుకోండి.
తరుచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు పొందండి మరియు పూర్తి కోర్సు యొక్క సారాంశాన్ని తెలుసుకోండి.
- పేద మరియు మధ్య తరగతి ప్రజలందరూ
- విద్యుత్ బిల్లును తగ్గించాలని కోరుకునే వ్యక్తులు
- వ్యవసాయానికి అయ్యే ఖర్చును తగ్గించుకోవాలనుకునే రైతులు
- సోలార్ ప్యానల్ అమర్చే వ్యాపారం చేస్తున్నారు
- సౌర వినియోగాన్ని ప్రోత్సహించే పర్యావరణ ప్రేమికులు
- PM సూర్యఘర్ పథకం యొక్క పూర్తి వివరణ
- సూర్యఘర్ పథకం యొక్క ఆర్థిక ప్రయోజనాలు
- అర్హత ప్రమాణాలు మరియు కావలసిన పెట్టుబడి
- ప్రభుత్వ సబ్సిడీ మరియు మద్దతు
- పథకం కోసం దరఖాస్తు ప్రక్రియ
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.