వయసు పెరిగే కొద్దీ, ఆరోగ్య ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అరవై దాటాక, పదవీ విరమణ తర్వాత, మీ సంపాదన అనేది పూర్తిగా నిలిచిపోతుంది. అటువంటి సమయాల్లో, ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీం ను ప్రవేశ పెట్టింది. రిటైర్డ్ అయిన తర్వాత, మీకు పెద్ద మొత్తంలో డబ్బు లభిస్తుంది. అదీ అందరికి తెలిసిన విషయమే! అయితే, ఇటువంటి సమయంలో, మీకు డబ్బు అవసరం వెంటనే లేకపోవచ్చు. లేదా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు అందుకోవడం ద్వారా, మీ బంధువుల నుంచి, లేదా బయటి వ్యక్తుల నుంచి మీకు ప్రమాదం ఉండొచ్చు. ఇటువంటి, పరిస్థితుల్లో మీరు సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీం ద్వారా మీ డబ్బుని పొదుపు చెయ్యొచ్చు. ఇది కేవలం 60 ఏళ్ళ వయసు దాటిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇదొక వన్-టైం ఇన్వెస్ట్మెంట్ పథకం. అంటే, ఇందులో మీరు డబ్బు మొత్తం ఒకేసారి పొదుపు చెయ్యవలసి ఉంటుంది. ఆ డబ్బు ఐదేళ్ల తర్వాత మీకు లభిస్తుంది. ఒక ఆర్థిక వార్షికంలో, మీకు మీ డబ్బుకి సంబందించిన వడ్డీ డబ్బులు, నాలుగు సార్లు అందుతాయి. ఇందులో వడ్డీ 7.4% ఉంటుంది.
కోర్సు పరిచయం
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ - అర్హత
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ - ఫీచర్స్ మరియు బెనిఫిట్స్
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాను ఎలా తెరవాలి?
ఈ ఖాతాని ఏ ఏ బ్యాంక్స్ లో తెరవచ్చు?
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ - పాత, కొత్త వడ్డీ రేట్లు
టెన్యూర్ మరియు ప్రిమెచ్యూర్ విత్‌డ్రాయెల్
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ - పన్ను ప్రయోజనాలు
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ vs వయ వందన యోజన
కోర్సు యొక్క సారాంశం
- 60 ఏళ్ళ పై బడిన వారందరూ, దీని గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం..
- ఇందులో మీరు 1000 నుంచి 15 లక్షల వరకు పొదుపు చెయ్యొచ్చు. అందువల్ల, మీ వద్ద చిన్న మొత్తం ఉన్నా సరే, దీని గురించి తెలుసుకోవచ్చు.
- రిటైర్మెంట్ తర్వాత, మంచి పొదుపు పథకం గురించి వెతుకుతున్నా, లేదా మీ వద్ద ఎక్కువ మొత్తం డబ్బులు ఉండి, దొంగల బెడదా, ఇతరత్రా అభద్రతా భావన కలిగి ఉన్నా, వెంటనే ఇందులో మీ డబ్బును పెట్టుబడి పెట్టండి.
- 100% సేఫ్, విధానంలో డబ్బులు దాయాలి అనుకున్నా సరే, ఈ పథకం గురించి మీరిప్పుడే తెలుసుకోవడం ప్రారంభించండి!
- సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీం (SCSS) అంటే ఏమిటి? దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇందులో మనం ఎందుకు పెట్టుబడి పెట్టాలి, దీనివల్ల మనకు ఏం లాభం? వంటి వాటితో పాటుగా,
- వీటికి ఎలా అప్లై చెయ్యాలి, ఎవరు అర్హులు? ఎక్కడికి వెళ్లి ఎస్.సి.ఎస్.ఎస్ ను పొందవచ్చు. ఇందుకు చెల్లించవలసిన మొత్తం ఎంత?
- దీనిపై ఉండే వడ్డీలు ఎలా ఉండనున్నాయి. ప్రభుత్వం, దీనిని మనకు ఏ విధంగా చెల్లిస్తుంది, వంటి ప్రతి చిన్న అంశాలు కూడా ఇందులో ఉన్నాయి
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
Senior Citizen Saving Scheme - Best scheme for senior citizens
12 June 2023
ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.