మా ఆలోచన
"ప్రతి వ్యక్తికి జీవనోపాధి పొందే అవకాశాన్ని కల్పించడం"
మా లక్ష్యం
1. ప్రతి ఒక్కరికీ నైపుణ్యాలు మరియు అవకాశాలను కల్పించడం
2. సమాజిక వ్యాపారం ద్వారా జీవనోపాధి అవకాశాలను అందించడం.
ffreedom.com ఏర్పాటు వెనుక ఉన్న కథ!
ffreedom.com వ్యవస్థాపకులు, MD & CEO C.S Mr.Sudheer గారు, గతంలో ఒక ప్రముఖ MNC బ్రోకింగ్ హౌస్‌లో పనిచేసేవారు. ఈ క్రమంలో 2008 సంవత్సరంలో ఒక ఆటో డ్రైవర్‌ను కలుసుకున్నారు. ఇద్దరి మాటల మధ్యలో "కేవలం ఒకసారి రూ. 25,000 చెల్లిస్తే, 3 సంవత్సరాల తర్వాత లక్ష రుపాయలు తిరిగి ఇస్తాం" అని హామీ ఇస్తూ ఇన్సూరెన్సు బ్రోకర్‌గా పనిచేసే ఒక వ్యక్తి, బీమా పాలసీని విక్రయించినట్లు ఆటో డ్రైవర్ సుధీర్ గారితో చెప్పారు.
అయితే అలాంటి పాలసీ ఏదీ కూడా అందుబాటులో లేదని ఆర్థిక, బీమా రంగ నిపుణులైన సుధీర్ గారికి తెలుసు. అంతేకాకుండా, పాలసీ డాక్యుమెంట్‌ని క్షుణ్ణంగా చదివారు. అందులో ఉన్న విషయాలను అనుసరించి అది రెగ్యులర్ ప్రీమియం ULIP పాలసీ. అంతేకాకుండా, పాలసీ తీసుకున్న వ్యక్తి ఏడాదికి రూ.25,000 చొప్పున మూడేళ్లకు మొత్తం రూ.75,000 చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత “మార్కెట్ పనితీరు”ను బట్టి పాలసీదారుడు రూ.50000 లేదా రూ.75,000 లేదా రూ.1 లక్ష పొందడానికి “అవకాశం ఉంటుంది”
దీంతో ఇన్సూరెన్సు బ్రోకర్ పాలసీ నిబంధనలు మరియు షరతులు పూర్తిగా చెప్పకుండానే పాలసీని ఆటోడ్రైవర్‌కు అమ్మాడన్న విషయం సుధీర్ గారికి అర్థమయ్యింది. అంతేకాకుండా, బెంగళూరులోని ఓ సాధారణ ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.25,000 పొదుపు చేసి పాలసీకి సంబంధించిన మిగిలిన వాయిదాలకు చెల్లించడం అసాధ్యం. దీంతో, ఆటోడ్రైవర్ ఆర్థికంగా చాలా నష్టపోతాడన్న విషయం అర్థమయ్యింది. ఈ సంఘటన సుధీర్ గారి మనసును కలచివేసింది. దీంతో సుధీర్ గారు ఆటో డ్రైవర్‌కు రూ.25,000 ఇచ్చి కొంత నష్టానైనా తగ్గించుకోమనిచెప్పాడు. అదే సమయంలో సుధీర్ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అదే ఆర్థిక సేవలు అందించే రంగంలో (ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలో) ఉన్న అనైతిక విక్రయ పద్ధతులను అంతం చేయడానికి, తనవంతు సహాయం చేయాలని సంకల్పించడం. ఈ క్రమంలో వారు పనిచేస్తున్న సంస్థకు రాజీనామా పత్రాన్ని అందించారు. అవసరంలో ఉన్నవారికి సరైన ఆర్థిక సలహాలు అందించడం కోసం ffreedom.com సంస్థను స్థాపించారు.