ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మీరు పైన పేరు చదవగానే, మీకు అర్ధం అయ్యే ఉంటుంది కదా! ఇది, నెల నెలా వడ్డీని సంపాందించే ప్రక్రియ అని! సాధారణంగా, ఆర్డీ లలో మీరు, నెల నెలా జమ చేస్తూ ఉంటారు. మీకు నిర్ణిత గడువు పూర్తి అవ్వగానే, అసలు, వడ్డీ కలిపి మీ చేతులలో ఉంటుంది. దీనితో పాటే, మన కేంద్ర ప్రభుత్వం, మంత్లీ ఇన్కమ్ స్కీం వల్ల, మీరు నెల నెలా వడ్డీను పొందవచ్చు. పైగా ఇది పూర్తి సురక్షితం కూడా! ఇంకెందుకు ఆలస్యం, దీని గురించి తెలుసుకుందామా?
దీర్ఘ కాలిక పొదుపు కోసం చూస్తున్నట్టు అయితే, పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం (POMIS) అనేది ఉపయోగకర మార్గం. ఇందులో మీరు ఒకే సారి పెట్టుబడి పెడతారు. మీకు ఐదేళ్ల పాటు దానికి సంబందించిన వడ్డీ అనేది, ప్రతీ నెలా, మీ అకౌంట్ లో పడుతూ ఉంటుంది. ఇందులో మీరు కనిష్టంగా 1000 రూపాయలు, గరిష్టంగా 4.5 లక్షలు వరకు, అదే జాయింట్ అకౌంట్ అయితే, 9 లక్షలు వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు మారుతూ ఉంటాయి