ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
జీతాలు తీసుకునే వారిలో రెండు రకాలు ఉంటారు. ఒకరు, ఆ నెల జీతం మొత్తం ఖర్చు పెట్టేస్తారు. మరి కొందరు, డబ్బులనీ కొంత వరకు పొదుపు చేస్తారు. మీ జీతం లోంచి, 30-40 శాతం దాచడం, భవిష్యత్తుకు ఎంతో ముఖ్యం. అయితే, ఈ పొదుపు అనేది సేవింగ్స్ అకౌంట్ లోనో, లేదా ఇంట్లో ఇనుప బీరువాలో దాచి ఉంచడం కంటే, పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ (PPF) లో పెట్టుబడి పెట్టడం మంచిది. ఎందుకంటే, ఇందులో మనం పెట్టుబడి పెట్టిన సొమ్ముకి దాదాపు రెట్టింపు సొమ్ముని పొందగలము!
చిన్న మొత్తాల సేవింగ్స్ లో అత్యుత్తమైన పొదుపు పథకం ఇది! మిగతా స్టాక్ మార్కెట్ లు, లేదా మ్యూచువల్ ఫండ్స్ కంటే, ఇది సురక్షితమైనది. ఎందుకంటే, ఇది కేంద్ర ప్రభుత్వంచే నడపబడుతుంది. అందువల్ల, ఇది 100 శాతం సురక్షితమైనది. సేవింగ్స్ కంటే, ఎక్కువ వడ్డీని మీరు ఇందులో పొందవచ్చు. ఇదొక దీర్ఘ కాలం పెట్టుబడి/ పొదుపు పద్ధతి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఈ కోర్సు గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి!