ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
"ఫ్యాన్సీ స్టోర్" అంటే సౌందర్యానికి కావాల్సిన ప్రతి వస్తువు ఒక చోట లభించడం! మీరు రెడీ అవ్వడానికి కావాల్సిన ప్రతి వస్తువు ఇందులో దొరుకుతుంది. అందులో పౌడర్, బొట్టు, కాటుక, మేక్ అప్ కాస్మటిక్స్, లేదా గిల్ట్ నగలు లేదా పెర్ఫ్యూమ్ ఇలాంటివి అన్ని, మనకు ఒకే చోట లభిస్తాయి. మహిళలు ఎక్కువగా, ఈ ఫాన్సీ స్టోర్ లో వారికి కావాల్సిన సౌందర్య ఉత్పత్తులు వంటివి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇంక పండగలు, పెళ్లిళ్లు వస్తే అక్కడే మకాం పెట్టేస్తారు. అంతలా మన మగువల మనసులు దోచుకోబట్టే, ఫాన్సీ స్టోర్ బిజినెస్ సీజన్ తో సంబంధం లేకుండా, అందరినీ లాభాల బాట పట్టిస్తుంది.
మీరు గనుక ఈ ఫాన్సీ స్టోర్ ప్రారంభించే ఉద్దేశం ఉంటె, మీరు సరైన చోటుకే వచ్చారు. ఈ కోర్సులో, ఫాన్సీ స్టోర్ ను నెలకొల్పి, విజయం సాధించే ప్రతి చిన్న మార్గాన్ని గురుంచి తెలుసుకోండి! ఇప్పటికే, ఎందరో ఈ బిజినెస్ లో ఉన్నారు, కానీ మనం వ్యహాత్మకంగా వ్యవహరిస్తూ,