ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు, డబ్బుకి డబ్బుకి కూడా తెచ్చిపెట్టే నాటు కోడి పౌల్ట్రీ అనేది మన దేశంలో వేగంగా విస్తరిస్తూ ఉంది. ఇందులో ఉండే పోషకాలు, రుచి వీటికి కారణం. అందుకే, బ్రాయిలర్ చికెన్, కిలో రూ.150-250 మధ్య ఉంటే, నాటుకోడి రూ 500-1000 మధ్య, లేదా ఆ పైనా పలుకుతుంది. సాధారణ గుడ్డు ఐదు నుంచి ఏడు రూపాయల మధ్య ఉంటె, నాటు కోడి గుడ్లు రూ. 10 నుంచి ప్రారంభం అవుతుంది.
ఇప్పటికే, అర్ధం చేసుకున్నారు కదా, నాటు కోడికి ఉండే డిమాండ్! పందెం కోళ్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇవి లక్షల్లో అమ్ముడు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి ప్రత్యేకతలు ఉన్న, నాటు కోళ్ల పెంపకం ఇప్పుడే కాదు, ఎప్పుడూ లాభదాయకమే! కాబట్టి, ఏడాదికి 6 లక్షల దాకా సంపాందించి పెట్టె, ఈ బిజినెస్ గురించి ఇప్పుడే తెలుసుకోండి.