ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే పండ్లలో, బొప్పాయి ఒకటి. ఇందులో విటమిన్ ఏ,బి,సి,డి లతో పాటుగా, ప్రోటీన్, కాల్షియమ్, పొటాషియం, సోడియం ఇలా అనేక రకాల పోషకాలతో నిండి ఉంది. అందుకే, చాలా మంది వీటిని తమ డైట్ లలో, చేర్చుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా, వీటిని ఇష్టపడి తింటుంటారు.
అందుకే, వీటిని చాలా ప్రాంతాల్లో పండిస్తూ ఉంటారు. ప్రతి ఏటా, 61 లక్షల టన్నుల బొప్పాయి సాగు అనేది జరుగుతూ ఉంటె, అందులో 30 లక్షల టన్నుల దాకా భారతదేశం నుంచే దిగుమతులు చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తైవాన్ బొప్పాయి వ్యవసాయంలో 50% మన దేశం నుంచే జరుగుతూ ఉంది. మీరు ఒక ఎకరా భూమిలో 900 నుంచి 1200 వరకు బొప్పాయి చెట్లను వెయ్యడం వల్ల మీరు ఒక ఏడాదికి ఖర్చులు అన్నీ పోనూ, మూడున్నర లక్షలు దాకా లాభం పొందొచ్చు. ఈ కోర్సులో వీటి గురించి మరింత తెలుసుకోండి.