ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్లనాన్న వారికి రెండు చింత మొక్కలు ఇచ్చి పెంచమన్నారు. వారు అలాగే చేసారు. తమ్ముడు ఆ మొక్క కొద్దిగా పెరిగిన తర్వాత చింత చిగురును తుంచి ఇంటిలో కూర చేసుకుని తినేవాడు. కొద్ది కాలానికి తమ్ముని మొక్క చనిపోయింది. అయితే అన్న మాత్రం ఆ చింత చెట్టు పెరిగి పెద్దదయ్యే వరకూ నీళ్ల పోసి ఎరువులు వేసాడు. మొక్క చెట్టుగా మారిన తర్వాత అందులో నుంచి చింతకాయలు తెంపి అమ్మి డబ్బులు సంపాదించి గొప్పవాడయ్యాడు. అయితే తమ్ముడు మాత్రం మొక్క పెరిగే వరకూ వేచి చూడక పోవడంతో పేదవాడిగా ఉండిపోయాడు. ఇలా ఎన్నో పొదుపు కథలను చెప్పి మీ పిల్లలను ఆర్థిక క్రమశిక్షణ వైపు నడిపించాలనుకుంటున్నారా? మీ లాంటివారి కోసమే డబ్బు మరియు పిల్లలు కోర్సు. మరెందుకు ఆలస్యం తర్వగా చేరండి. మీ పిల్లలకు కథల రూపంలో ఎన్నో ఆర్థిక పాఠాలు చెప్పండి.