ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మీరు ఒక్కసారే ఎక్కువ డబ్బులు జమ చెయ్యలేని వారా? నెల నెలా ఎంతో కొంత చిన్న మొత్తం దాయాలి అనుకుంటున్నారా? ఇలా డబ్బులు దాచిపెట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్, SIP విధానం, RD, చిట్ ఫండ్స్ లాంటివి అన్నమాట.
రిస్క్ లేకుండా డబ్బులు దాచుకోవాలి అనుకునే వారికి, రికరింగ్ డిపోసిట్ అనేది అత్యుత్తమ మార్గం. అందుకే, ఈ RD విధానం మిగతా అన్నీ, డబ్బు పొదుపు చేసే మార్గాల కంటే పాపులర్ అయ్యింది. ఈ విధానంలో కనిపించే ఎన్నో ఉపయోగాలు, సదుపాయాలు వల్లే, రికరింగ్ డిపోసిట్ చిరు ఉద్యోగులు, దిగువ, మధ్య తరగతి వారికి పర్సనల్ పిగ్గీ బ్యాంకు గా ఉంటుంది.
ఇందుకు ఎన్నో కారణాలు కావచ్చు. తక్కువ మొత్తంలోనే ప్రారంభించే వెసులుబాటు, రిస్క్ అనేది అస్సలు లేకపోవడం వాటితో పాటు ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. లేట్ ఎందుకు, రికరింగ్ డిపోసిట్ గురించి, పూర్తిగా తెలుసుకోడానికి, ఈ రికరింగ్ డిపాజిట్ కోర్సు గురించి తెలుసుకోండి!