ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సొంతంగా వాహనాన్ని ముఖ్యంగా కారును సమకూర్చుకుంటున్నారు. ఈ కార్ ను కనీసం నెలకు ఒకసారి అయినా శుభ్రం చేసుకోవాల్సిందే. అయితే ఈ బిజీలైఫ్‌లో తమ వాహనాన్ని తామే శుభ్రం చేసుకోవడానికి కూడా ప్రజలకు సమయం దొరకడం లేదు. దీంతో కార్ స్పా కు వెలుతున్నారు. ఈ సందర్భాన్ని వ్యాపారంగా మలుచుకుంటే ప్రతి వాహనం శుభ్రం చేసిన తర్వాత అందే ఆదాయంలో 30 శాతం వరకూ లాభం ఉంటుంది.