ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
పుట్టగొడుగుల గురించి మనకు ఒక ఇరవై-ముప్పై ఏళ్ళ క్రితం వరకు అంతగా తెలియక పోయినా, ఇప్పుడు పుట్టగొడుగులు… అదేనండీ, ముష్రూమ్స్, మన ఇళ్లలో, మన వంటల్లో భాగం అయిపోయాయి! ఇవి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉండడం వల్లే, అన్ని చోట్లా, వీటికి ఇంతలా డిమాండ్ ఉంది.
తక్కువ క్యాలోరిస్ తో ఎక్కువ న్యూట్రియెంట్స్ అందించే, ఆహరం కావడం తో పుట్ట గొడుగులు మధుమేహం వ్యాధిగ్రస్థులు, హెపటైటిస్-బి, థైరాయిడ్ వంటి మరిన్నో వాటితో బాధ పడుతున్న వారి పాలిట వరంగా మారుతున్నాయి.
కోవిడ్ అనంతరం, మన దేశంలో కూడా పుట్టగొడుగుల పెంపకం పై అవగాహన బాగా పెరిగింది. కరోనా బారిన పడిన వారు అందరు, త్వరగా కోలుకోడానికి పుట్టగొడుగులనే ఆశ్రయిస్తున్నారు.
సరిగ్గా చెయ్యగలిగితే, పుట్టగొడుగుల సాగు మించిన బెస్ట్ వ్యాపారం ఉండదు. ఈ బిజినెస్ లోకి దిగక ముందే, మీరు ఎన్నుకున్న పుట్ట గొడుగు రకానికి, ఎలాంటి మౌలిక సదుపాయాలు, సాంకేతికత అవసరమో, ఖచ్చితంగా తెలుసుకోవాలి.