ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
ఏ వాతావరణంలో అయినా, జనాలు అమితాసక్తితో తినే ఫుడ్ ఏదైనా ఉంది అంటే, అది బేకరీ ఫుడ్ ఏ! చల్లని వాతావరణం లో వేడి వేడి పఫ్ లు, అలాగే వేడిగా ఉన్నప్పుడు కేక్ వంటివి లేదా బ్రెడ్. బేకరీలో ఉండే ప్రతి ఆహార పదార్ధం మనల్ని నోరూరిస్తుంది. అందుకే, సీజన్ తో పని లేకుండా, ఎప్పుడూ బేకరీ లు జనాలతో కిటకిటలాడుతూ ఉంటాయి. క్రిస్ట్మస్, పండుగల సమయంలో బిజినెస్ అనేది మూడింతలు ఎక్కువగా ఉంటుంది.
హోం ఫుడ్స్ పై ప్రజలు మక్కువ పెంచుకుంటూ ఉన్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో రుచిగా తయారయ్యే వంటలకు ఎంత డబ్బు వెచ్చించడానికి అయినా వెనుకాడటం లేదు. బేకరీ పదార్థాలకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుండటమే ప్రత్యక్ష ఉదాహరణ. మీరు, ఒక బేకరీ ను ప్రారంభించి, బాగా సంపాదిద్దాం అనుకుంటే, ఈ బిజినెస్ కు కావాల్సిన ప్రతి విషయం బడ్జెట్, ప్రణాళిక, సిబ్బంది, చెఫ్ ఇలా ప్రతి విషయాన్నీ గురించి ఇందులో పొందుపరిచాం.
బేకరీ ను సందర్భాన్ని వ్యాపారంగా మలుచుకుంటే అధిక లాభాలను పొందవచ్చు. అది ఎలాగో ఈ బేకరీ వ్యాపారం కోర్సు ద్వారా తెలుసుకుందాం రండి.