ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
రోజువారీ రవాణా కోసం కారులు, వాహనాలు వినియోగించే వారి సంఖ్య క్రమంగా పెరిగినందున, కార్ రిపేర్ చేసేవారు, అలాగే సర్వీస్ చేసి, క్లీన్ చేసే వారి అవసరం పెద్ద ఎత్తున ఉంది. బాగా డిమాండ్ ఉన్న ప్రాంతంలో మీరు కారు సర్వీస్ బిజినెస్ ను ప్రారంభిస్తే, మీకు మంచి లాభం వస్తుంది, అలాగే మీకంటూ డిమాండ్ ఏర్పడుతుంది.
దీనికి సీజన్ అంటూ ఉండదు. అన్నీ సమయాలలోనూ డిమాండ్ ఉంటుంది. దీనిని ప్రారంభించడానికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. చిన్న మొత్తంలోనే ప్రారంభించి, మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంకా సమయం వృధా చేసుకోకుండా, ఈ కార్ సర్వీస్ సెంటర్ వ్యాపారం ను ప్రారంభించండి. దీనికి ముందుగానే చెప్పుకున్నట్టు, ఎల్లప్పుడూ హై- డిమాండ్ ఉండనుంది. అలాగే దీని కొరకు మీ వద్ద ప్రారంభ పెట్టుబడి లేనట్టు అయితే, దీనిని ఇవ్వడానికి ఎన్నో బ్యాంకులు ముందుకు వస్తున్నాయి.