ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
ఒక సినిమాను కానీ, వీడియో ను కానీ ఆసక్తికరంగా మార్చడంలో ఎడిటింగ్ అనేది, అతి ముఖ్యమైనది. అందుకే చాలా మంది, వీడియో ఎడిటింగ్ నేర్చుకుని, మంచి లాభాలను గడిస్తున్నారు. ఎడిటింగ్ చెయ్యడం అంత సులువేం కాదు. అలా అని అసాధ్యం కూడా కాదు. దీనికి కొంచెం ఓపిక, పరిశీలనా శక్తీ బాగా ఉండాలి. తప్పులను గుర్తించడంలో మంచి నేర్పరి అయ్యుండాలి. ఇవేం మీకు స్వతహాగా లేకపోయినా గాని, మీరు అనుభవం నుంచి ఎడిటింగ్ ఎలా చెయ్యాలో నేర్చుకుంటారు.
చాలామంది ఎడిటింగ్ ను దెయ్యమో, భూతమో అన్నట్లు చూస్తారు, ఇంకొంతమంది, అవన్నీ బయట వాళ్ళే చెయ్యాలి, మన వల్ల అయ్యేపని కాదనుకుంటారు. కానీ, యూట్యూబ్ వరకు అయితే, మీ ఎడిటింగ్ మీరే చేసుకోవడం నేర్చుకున్నట్టు అయితే, మీకు, ఎంతో కొంత ఖర్చులు తగ్గుతాయి.
అప్పటి… మీకెంతో నచ్చి తీసిన వీడియోలు అన్ని, మీరు మా కోర్సును నేర్చుకుని, సొంతంగా వీడియో ఎడిట్ చేసుకొని, యూట్యూబ్ లో మంచి లాభాలను గడించవచ్చు.
ఇప్పుడే, యూట్యూబ్ లో ఏదైనా ప్రారంభిద్దాం అనుకుంటున్నా, లేదా మీకు editing అంటే ఆసక్తి ఉన్నా, మీకు ఈ కోర్స్ రైట్ ఛాయస్! మరేం ఆలోచించకుండా, ఈ కోర్సును ఇప్పుడే పొందండి.
ఇందులో, మీకు ఎడిటింగ్ కి సంబందించిన అన్నీ బేసిక్ విషయాలు, ఎడిటింగ్ ప్రాముఖ్యత ఏంటి వంటి అంశాలు సులువుగా నేర్చుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం? ఈ కోర్స్ గురించి పూర్తిగా తెలుసుకుందామా?