ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
పైన పచ్చడి అనే పేరు అని చదవగానే, నోరు ఊరని తెలుగు నోరు ఉంటుందా? అందుకే, మనోళ్లు “అమ్మా, ఆవకాయ” ఎప్పటికి బోర్ కొట్టవు అంటారు. నిజమే మరీ, అంతలా మన తెలుగు వారి మనస్సుల్లో స్థానం సంపాదించుకుంది.
దీనిని ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తారు. కొంతమంది, ఆవకాయ అంటే, మరికొంతమంది ఊరగాయ అంటారు, ఇంకొన్ని చోట్ల పచ్చడి అని అంటారు. పేరు ఏదైనప్పటికీ, దాని పై మనకున్న ప్రేమ మాత్రమే ఒక్కటే!
ఆవకాయ కూరగాయలు, పండ్లతో చేస్తారు అన్న విషయం, మన అందరికీ సుపరిచితమే! ఉదాహరణకు మామిడి, ఉసిరి, టమాటా మరియు పండు మిరపగాయ పచ్చడి వంటివి అన్నమాట!
పోగా పోగా, ఇందులో నాన్ వెజ్ పచ్చళ్ళు చెయ్యడం కూడా ప్రారంభించారు. ఇంకేముంది, నాన్-వెజ్ ప్రియులకి పండగే, పండుగా! లొట్టలు వేసుకుంటూ తింటున్నారు. మొదట్లో, చికెన్ తో మొదలు పెట్టి, ఇప్పుడు, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు వంటి వాటితో పచ్చళ్ళు పడుతున్నారు. అన్ని ప్రాంతాలలో పచ్చళ్ళు చేస్తారు కానీ, తెలుగు పచ్చళ్ళకి ఉండే డిమాండ్ మరియు వాటి రుచి వేరుగా ఉంటుంది. ఆ కారణం చేతే, ఇప్పుడు మన పచ్చళ్ళకి మన రాష్ట్రం నుంచే కాక, పక్క రాష్ట్రాలు, ఖండాంతరాలు నుంచి కూడా వీపరీతంగా డిమాండ్ ఉంది.
2020 నాటి లెక్కల ప్రకారంగా, పచ్చళ్లకు గ్లోబల్ మార్కెట్ లో అక్షరాలా 10.6 బిలియన్ డాలర్ల టర్న్ ఓవర్ ఉంది. అంటే, భారీగా డిమాండ్ ఉంది అన్న విషయం మీకు అర్ధమౌతుంది, కదా !