ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మన దేశంలో ప్రతి సంవత్సరం పాఠశాలల్లో చేరే పిల్లల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇది మీ ప్రాంతానికీ కూడా వర్తిస్తుంది. అదేవిధంగా విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్ది వారికి అవసరమైన పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ అమ్మకాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఇలా అమ్ముడు పోయిన ఒక్కొక్క స్టేషనరీ వస్తువు పై 20 నుంచి 30 శాతం మార్జిన్‌ను సంపాదించడానికి వీలవుతుంది. మరెందుకు ఆలస్యం స్టేషనరీ వ్యాపారం పై లాభాలను ఎలా ఒడిసిపట్టాలో ఈ కోర్సుద్వారా నేర్చుకుందాం.