ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
ఐస్ క్రీం, ఫ్రూట్ జ్యూస్ ఇష్టపడని వారు, ఎవరూ ఉండరు. చిన్నవాళ్లు, పెద్ద వాళ్ళు అని తేడా లేకుండా అందరూ ఇష్టపడి తినే, ఒక ఫుడ్ ఇది. కొంతమంది దీనిని, డెసెర్ట్ లాగా, ఇంకొంత మంది స్నాక్స్ లాగా, ఇంకొంతమంది కాలక్షేపానికి… ఇలా ఎవరికీ నచ్చినట్టు వారు, కారణాలు వెతుక్కుని మరీ, ఐస్ క్రీం ను, ఫ్రూట్ జ్యూస్ లను సిప్ చేసేస్తుంటారు. అందుకే, ప్రతి సందు చివర మీకు, ఈ కొట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి.
అయితే, పోను పోనూ, వీటి డిమాండ్ మరింత పెరగనుంది. వీటి పెట్టుబడికి మీకు 5 లక్షలు ఉంటె సరిపోతుంది. దీని కోసం, మీకు లోన్ కూడా సదుపాయం కూడా ఉంది. మీరు ఈ జ్యూస్ వ్యాపారం, ఐస్ క్రీం వ్యాపారం ద్వారా నెలకు నికరంగా 20 వేలు లేదా ఆ పైనా సంపాదించవచ్చు. మీరే స్వయంగా షాప్ అయినా పెట్టుకోవచ్చు లేదా ఫ్రాంచైజీ ను అయినా పెట్టుకుని బాగా సంపాదించవచ్చు.