ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మేడ పై ఖాళీ స్థలంలో మొక్కల పెంపకాన్నే టెర్రస్ గార్డెన్ అంటారు. మొక్కల పెంపకానికి రసాయనాలు కాక సేంద్రియ పదార్థాలను ఎరువులుగా, కీటకనాశకాలుగా వాడితే దానినే ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ అంటారు. రూ.5వేల కనీస పెట్టుబడితో టెర్రస్ గార్డెన్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ విధానంలో పండ్లు, పూలు, ఆకు కూరలు, కాయగూరలతో పాటు ఔషద మొక్కలనూ పండించవచ్చు. వీటిని మన ఇంటి అవసరాలకు వాడుకుని మిగిలినవి అమ్ముకుని ప్రతి రోజూ ఆదాయం పొందవచ్చు. ఈ టెర్రస్ గార్డెన్ ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా మనం ఆరోగ్యంగా ఉండటానికి కూడా తోడ్పడుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు.