ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
నాలుగు ఎకరాల్లో నుంచి అందే ఫలసాయాన్ని ఐదు అంచెల వ్యవసాయ విధానం ద్వారా ఒక్క ఎకరాలోనే సాధించవచ్చు. ప్రకృతి అనుకూలమైన ఈ 5 లేయర్ వ్యవసాయం విధానంలో ప్రతి నెలా ఆదాయాన్ని పొందవచ్చు. సేంద్రియ వ్యవసాయంలో భాగమైన ఈ ఫైవ్ లేయర్ సాగు విధాన రూపకర్త సుభాష్ పాలేకర్. ఇన్ని విశేషాలు ఉన్న ఐదు అంచెల వ్యవసాయ విధానం గురించిన పూర్తి వివరాలు ఈ కోర్సు ద్వారా తెలుసుకుందాం రండి.