ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
కడకనాథ్ కోడి అనగానే అదేంటి అని అంటారేమో! కానీ నల్ల కోడి అంటే మాత్రం అందరికి టక్కున అర్ధమౌతుంది. “ఓ అదా!” అని అనుకుంటూ ఉంటారు. మీరు యూట్యూబ్ లోనో, అక్కడా ఇక్కడా ఈ కోళ్లను చూసే ఉంటారు. ఈ కోడి కళ్ళు, నాలుక, ముక్కు, చర్మం, ఈకలు ఇలా ప్రతిదీ నలుపు రంగులోనే ఉండడం విశేషం. అంత ఎందుకు, ఈ కోడి మాంసం, గుడ్లు కూడా నల్లగానే ఉంటాయి!
వీటి డిమాండ్కు ముఖ్య కారణం, ఇది అన్ని చోట్లా మనకు లభ్యం కాదు. కొన్ని చోట్ల మాత్రమే మనకు ఇది లభిస్తుంది. అలాగే, ఇందులో పోషకాలు కూడా ఎక్కువే! వీటిల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, మన బ్లడ్ కి కావలిసిన ఐరన్ ఇందులో దొరుకుతుంది. దీనితో పాటు రకరకాలా విటమిన్స్ కూడా ఇందులో మనకి లభ్యం అవుతున్నాయి. ఇందులో కొవ్వు శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తిని ఇది పెంచుతుంది.
వీటిని హోమియోపతి లో వాడుతారు. అలాగే హృదయ రోగులు, మూర్ఛ, పరాలైసిస్ వంటి రోగాలను కలిగిన వారు తింటే, మంచిది. ఇక రుచి విషయానికి వస్తే, నాటు కోడి, కూడా, దీని ముందు సాటి రాదు అంటే నమ్మండి. అంత బాగుంటుంది, ఈ చికెన్! మరీ దీనికి ఎందుకు