ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
వంటనూనెలను గానుగను ఆడించి తయారు చేసి అమ్మడం ద్వారా లక్షల రుపాయల ఆదాయం వస్తుంది. పూర్వం గానుగ పట్టించిన నూనెలనే వంటల తయారీకి వాడేవారు. అయితే కొన్నేళ్ల క్రితం నుంచి రిఫైన్డ్ ఆయిల్ ను వినియోగిస్తూ వంటలను తయారు చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం వాటి ధరలు గానుగ నూనెలతో పోలిస్తే కొంత తక్కువగా ఉండటమే. అయితే ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. దీంతో చాలా మంది ఇప్పుడిప్పుడే తిరిగి గానుగ నూనెను తమ వంటల తయారీలో వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో గానుగ నూనెకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ గానుగ తయారీ వంట నూనెల వ్యాపారం ఎలా ప్రారంభించాలి? లాభాలు ఎలా తీసుకోవాలో ఈ కోర్సు ద్వారా తెలుసుకుందాం రండి.