ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
సంప్రదాయ విధానాల్లో ఎక్కువ విస్తీర్ణంలో భూమి ఉన్నప్పుడు మాత్రమే వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. అయితే భారత దేశ జనభా రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. అదే సమయంలో వ్యవసాయ భూ కమతాల సగటు విస్తీర్ణం తక్కువవుతోంది. ఈ క్రమంలో ఆ చిన్న కమతల్లోనే వ్యవసాయం చేస్తే తక్కువ రాబడి వస్తుంది. అయితే సాగు విధానాల్లో మార్పుతో పాటు నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని సాగు చేస్తే కేవలం ఒక్క ఎకరం నుంచే నెలకు దాదాపు రూ.1 లక్ష ఆదాయాన్ని కళ్లచూడవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ ఈ కోర్సు ద్వారా నేర్చుకుందాం.