4.5 from 40.3K రేటింగ్స్
 3Hrs 47Min

ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోర్సు - వ్యవసాయం నుండి 365 రోజులు సంపాదించండి

సమీకృత వ్యవసాయ విధానాల ద్వారా ప్రతి రోజూ సంపాదన అందుకునే చిట్కాలు ఈ కోర్సులో నేర్చుకోండి

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

How to do Integrated Farming in India
 
పర్సనల్ ఫైనాన్స్ కోర్సులు(25)
వ్యవసాయం కోర్సులు(64)
వ్యాపారం కోర్సులు(64)
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
3Hrs 47Min
 
పాఠాల సంఖ్య
12 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
వ్యవసాయ అవకాశాలు, Completion Certificate
 
 

మీరు అత్యంత స్థిరమైన వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోర్సు లేదా సమీకృత సాగు పై రూపొందించిన కోర్సు సరైన ఎంపిక. ఈ కోర్సు ప్రస్తుతం ffreedom Appలో అందుబాటులో ఉంది! 

ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది పర్యావరణ అనుకూలమైన మరియు ఆర్థికంగా లాభదాయకంగా ఉండే పంటలను ఒకే వ్యవసాయ క్షేత్రంలో పండించడం. ఇందులో పశుపోషణ, చేపల పెంపకం కూడా భాగమే. అంటే సమీకృత వ్యవసాయ విధానం లేదా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అన్నది సమగ్రమైన మరియు స్థిరమైన వ్యవస్థను రూపొందించడానికి వివిధ వ్యవసాయ పద్ధతులను మిళితం చేసే విధానం. ఈ కోర్సులో, మీరు ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్‌తో సహా వివిధ రకాల ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ గురించి నేర్చుకుంటారు.

సమీకృత వ్యవసాయం యొక్క ప్రయోజనాలను మరియు వ్యవసాయ ఉత్పాదకత, ఆర్థికంగా సంపాదించడం మరియు లాభదాయకతను ఎలా పెంచగలదో మీరు ఈ కోర్సు ద్వారా తెలుసుకుంటారు. ఈ కోర్సు తీసుకోవడం ద్వారా సాగులో మానవ వనరుల వినియోగాన్ని తగ్గించడం, తద్వారా ఖర్చులను ఎలా తగ్గించాలో తెలుసుకుంటారు. అదేవిధంగా మృత్తిక ఆరోగ్యాన్ని ఎలా పెంచాలో తెలుసుకుంటారు. ఈ కోర్సు ద్వారా పాడి పశువుల పెంపకం, ఆక్వాకల్చర్, ఆగ్రోఫారెస్ట్రీ వంటి విధానాల పై కూడా అవగాహన పెంచుకుంటారు. 

 సమీకృత వ్యవసాయం గురించి నేర్చుకోవడంతో పాటు, మీరు సమీకృత వ్యవసాయ విధానాన్ని ఎలా రూపొందించాలి, అమలు చేయాలన్న నైపుణ్యాలను కూడా పెంపొందించుకుంటారు.  నిపుణుల ఆధ్వర్యంలో రూపొందించిన ఈ కోర్సులో భాగంగా మీకు మెంటార్ పరిచయం కలుగుతుంది. మెంటార్ ద్వారా ఈ రకమైన సాగు విధానంలోని చిట్కాలు తెలుసుకుంటారు. 

మరెందుకు ఆలస్యం సాగు ద్వారా స్థిరమైన ఆర్థిక లాభదాయకత కోసం ఈరోజే ffreedom Appలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోర్సు పై  సైన్ అప్ చేయండి.

 

ఈ కోర్సు, ఎవరికీ ప్రయోజనకరంగా ఉంటుంది?

  • సాగు విధానాలను మెరుగుపరుచుకుని లాభదాయకతను పెంచుకోవాలనుకుంటున్న రైతులు

  • ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సంబంధిత వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆసక్తితో ఉన్నవారు

  • వ్యవసాయ సంబంధిత కోర్సులు చదువుతున్న విద్యార్థలు, సాగు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నవారు

  • పర్యావరణవేత్తలు మరియు సుస్థిరత ఔత్సాహికులు సమీకృత వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు

  • స్థిరమైన ఆహార ఉత్పత్తి మరియు ఆర్థిక లాభాలను పొందాలనుకుంటున్నవారు

 

ఈ కోర్సు నుండి, మీరు నేర్చుకోనున్న అంశాలు:

  • సమీకృత వ్యవసాయ విధానాలు మరియు వాటి ప్రయోజనాలు

  • సమీకృత సేంద్రియ వ్యవసాయం, పశుపోషణ, ఆగ్రోఫారెస్ట్రీ మరియు ఆక్వాకల్చర్ సహా వివిధ రకాల సమగ్ర వ్యవసాయ విధానాలు

  • సమీకృత వ్యవసాయ ప్రణాళిక రూపకల్పన, అమలు

  • సమీకృత వ్యవసాయ విధానంలో ఖర్చులు మరియు ఉత్పాదకత లాభదాయకతను పెంచడానికి వ్యూహాలు

  • సాగు మరియు పశువుల పోషణ, నేల ఆరోగ్యం మరియు నీటి నిర్వహణ  నైపుణ్యాలు మరియు పద్ధతులు.

 

పాఠాలు

  • పరిచయం: వినూత్న వ్యవసాయ పద్ధతిగా పేరుగాంచిన సమీకృత సాగులోని ప్రాథమిక విషయాల పై అవగాహన కలుగుతుంది.

  • మెంటార్స్‌తో పరిచయం: సమీకృత సాగు విధానంలో విజయం సాధించిన వారితో నేరుగా పరిచయం ఏర్పడుతుంది. వారి ద్వారా సమీకృత వ్యవసాయ చిట్కాలు తెలుసుకోవచ్చు.

  • సమ్మిళిత సాగు ఉపయోగాలు: వివిధ రకాల పంటలను ఒకే వ్యవసాయ క్షేత్రంలో పండించడం వల్ల కలిగే లాభాలను ఈ మాడ్యూల్ ద్వారా తెలుసుకుంటాం. 

  • సమీకృత సాగు ప్రణాళిక: సమీకృత సాగు ప్రణాళికను రూపొందించడం ఎలాగో ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది. 

  • పెట్టుబడి, ప్రభుత్వ సహకారం: సమీకృత విధానంలో సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో అందే సహకారం అంటే పెట్టుబడి, రుణాలు, సబ్సిడీ తదితర విషయాల పై ఈ మాడ్యూల్ అవగాహన కల్పిస్తుంది. 

  • సమీకృత సాగు రకాలు: వివిధ రకాల సమీకృత వ్యవసాయ విధానాల గురించి ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది. అంతేకాకుండా మీ పరిస్థితులకు తగ్గట్టు ఏ విధానం ఎంచుకోవాలన్న విషయం పై స్పష్టత వస్తుంది. 

  • అగ్రి బిజినెస్: సమీకృత సాగు విధానం ద్వారా పండించే పంటలను మార్కెట్లో అమ్మడం, దాని వల్ల దక్కే ప్రతిఫలం తదితర విషయాల గురించి ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది. 

  • 365 రోజులూ ఆదాయం: సమీకృత సాగు విధానం ద్వారా ఏడాది మొత్తం ప్రతి రోజూ సంపాదనను కళ్ల చూడటం ఎలాగో ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది.

  • సాంకేతికత, నీటి పారుదల: సమీకృత సాగు విధానానికి అవసరమైన అత్యాధునిక సాంకేతికతకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటాం. అదేవిధంగా నీటి పారుదలకు సంబంధించిన చిట్కాల పై అవగాహన కలుగుతుంది.

  • ఎరువులు: సమీకృత సాగు విధానానికి అనుగుణంగా ఎరువుల వినియోగానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది. 

  • మార్కెటింగ్ వ్యూహాలు: సమీకృత సాగు విధానంలో పండించే పంటలు, వాటి కోతలు, ఉత్పత్తుల మార్కెటింగ్ తదితర విషయాల పై స్పష్టత వస్తుంది.

 

సంబంధిత కోర్సులు

 
Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!